ఉప్పలపాడులో రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన కాయల పంపిణీ
అవసరమైన మేరకు విత్తనాలు అందించాలని అధికారులకు వినతి*
ముదిగుబ్బ, జూన్ 30: ఖరీఫ్ సీజన్‌ను పురస్కరించుకుని ఉప్పలపాడు, పీసీ రేవు పంచాయతీల పరిధిలోని రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన కాయలను మంగళవారం పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముదిగుబ్బ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ తుమ్మల మనోహర్, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మండల కన్వీనర్ అశ్వర్థ రెడ్డి పాల్గొని రైతులకు విత్తన కాయలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పలపాడు, పీసీ రేవు పంచాయతీల పరిధిలో సుమారు 1,600 మంది రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని, వారందరికీ సరిపడా సబ్సిడీ వేరుశనగ విత్తన కాయలను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరినట్లు తెలిపారు. విత్తన సబ్సిడీ కోసం ఇంకా నమోదు చేసుకోని రైతులు సంబంధిత గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విత్తనాలతో సాగు చేపట్టి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో రామ్మోహన్‌రెడ్డి, జయరాములు, నరసింహులు, అనిల్ కుమార్, ఓబుళనాయుడు, రామాంజి, వెంకటరమణ, రామసుబ్బారెడ్డి, బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..
ఉప్పలపాడులో రైతులకు సబ్సిడీపై వేరుశనగ విత్తన కాయల పంపిణీ
