గౌరవ భారత రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం….

గౌరవ భారత రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం..

– : ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న గౌరవ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు..

– : కార్యక్రమంలో పాల్గొననున్న రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు నారా లోకేశ్, రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, తదితరులు..

– జులై 01వ తేదీన బుధవారం ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి గౌరవ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరవుతుండగా, బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్దనున్న సెంట్రల్ యూనివర్సిటీలో రాష్ట్రపతి పర్యటనకు సర్వం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు నారా లోకేశ్, రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, కేంద్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య ఎస్.ఎ.కోరి, తదితరులు పాల్గొననున్నారు. ఇందులో గౌరవ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మంత్రివర్యులు నారా లోకేశ్, రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, తదితరులు స్వాగతం పలకనున్నారు. కేంద్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, స్నాతకోత్సవ కార్యక్రమం వేదిక వద్ద జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి సర్వం సిద్ధం చేశారు.

1,268 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం :

– అనంతపురంలోని బుక్కరాయసముద్రం మండలం జంతులూరు వద్దనున్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తన విద్యా ప్రస్థానంలో తొలి స్నాతకోత్సవాన్ని జూలై 1న బుధవారం నిర్వహించనుంది. ఈ వేడుకకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరై స్నాతకోత్సవ ప్రసంగాన్ని చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ కులాధిపతి డా.శంకర్ ఆచార్య అధ్యక్షత వహించనున్నారు. ఈ తొలి స్నాతకోత్సవంలో 2020 నుండి 2026 వరకు వివిధ విద్యా సంవత్సరాలకు చెందిన 1,268 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేయనున్నారు. వీరిలో 480 మంది స్నాతక, 788 మంది స్నాతకోత్తర విద్యార్థులు ఉండగా, వీరు దేశంలోని 23 రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే 11 రాష్ట్రాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు 56 విశ్వవిద్యాలయ స్వర్ణ పతకాలు, 8 దాతృత్వ స్వర్ణ పతకాలు ప్రదానం చేయనున్నారు. 2018లో స్థాపితమై, 2019లో పార్లమెంట్ చట్టం ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయ హోదా పొందిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అతి తక్కువ కాలంలోనే దేశంలోని వేగంగా అభివృద్ధి చెందుతున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఎదిగింది. ఈ విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం 9 స్నాతక, 18 స్నాతకోత్తర, 6 పీహెచ్.డి., 15 డిప్లొమా కార్యక్రమాలు అమలులో ఉండగా, దేశంలోని 26 రాష్ట్రాలకు చెందిన 1,470 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

– గౌరవ భారత రాష్ట్రపతి పర్యటనకు పటిష్టమైన భద్రత చేపట్టారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా బందోబస్తు చర్యలు చేపట్టడం జరిగింది. రాష్ట్రపతి పర్యటనను విజయవంతం చేసేలా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.

Posted Under AP
Editor