రాయదుర్గంలో వేడుకలా సీఎం. సహాయనిధి చెక్కుల పంపిణీ!

రాయదుర్గంలో వేడుకలా సీఎం. సహాయనిధి చెక్కుల పంపిణీ!

రాయదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఒక వేడుకను తలపించేలా ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి లబ్ధిదారులు, ప్రజలు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నిరుపేదల ఆరోగ్య భద్రతకు, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడమే పరమావధిగా సాగిన ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం పట్టణంలో కోలాహలాన్ని నింపింది. ఇది వందలాది నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపిన గొప్ప కార్యక్రమంగా సాగింది. రాయదుర్గం పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి కళ్యాణమండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు 73మంది లబ్ధిదారులకు రూ.34.93లక్షల విలువైన చెక్కులు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ రెండేళ్లలో 480 మందికి రూ.2.99కోట్ల మేరసాయం అందించామన్నారు. రాయదుర్గం వెనుకబడిన ప్రాంతం కావడంతో ఇక్కడ పేద, మధ్యతరగతి కుటుంబాలు అధికంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా వైద్య అవసరాల కోసం పెద్ద పట్టణాలకు వెళ్లాల్సి రావడం, చికిత్స ఖర్చులు భరించలేక అనేక కుటుంబాలు అప్పుల బారిన పడుతున్న పరిస్థితులు ఉన్నాయని వివరించారు. పేదలకు ఆర్థిక సాయం వెనక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మానవీయ కోణాన్ని ప్రశంసించారు. పేదరికం కారణంగా ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదన్నదే ముఖ్యమంత్రి దృఢ సంకల్పమని ఆయన పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ, ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ వైద్యం చేయించుకోలేని నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఒక సంజీవనిలా మారిందని కొనియాడారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా ముఖ్యమంత్రి అత్యంత ఉదారతతో స్పందిస్తూ రికార్డు స్థాయిలో నిధులను మంజూరు చేయడం వారి ప్రజా రంజక పాలనకు అద్దం పడుతోందని వివరించారు. వెనుకబడ్డ రాయదుర్గం ప్రాంతంపై ముఖ్యమంత్రికి ప్రత్యేక అభిమానం ఉన్నందునే ఇంత భారీ స్థాయిలో పేదలకు ఆర్థిక సాయం అందుతోందన్నారు. నియోజకవర్గంలో ఏ పేద కుటుంబానికి ఏ కష్టం వచ్చినా స్పందిస్తూ… బాధితుల దరఖాస్తులను తానే స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయంతో సమన్వయ పరుస్తున్నట్లు తెలిపారు. దాని వల్లే రికార్డు స్థాయిలో త్వరితగతిన బాధితులకు చెక్కులు మంజూరు అవుతున్నాయన్నారు. ప్రజాక్షేమమే ధ్యేయంగా, నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి కష్టాలను తీర్చుతునందుకు ఎంతో ఆనందంగా, గర్వకారణమని ఉందని హర్షం వ్యక్తం చేశారు.

లబ్ధిదారుల ఆనందోత్సాహాలు:

చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు తమ హృదయపూర్వక కృతజ్ఞతలు చాటుకున్నారు. ఆపత్కాలంలో ఆదుకున్న ముఖ్యమంత్రికి, దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయించిన ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకి తాము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామంటూ భావోద్వేగానికి లోనయ్యారు. రాయదుర్గం నియోజకవర్గ ప్రజల కష్టాలను తీర్చడంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చూపిస్తున్న చొరవ, చేస్తున్న కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బండి కృష్ణ మూర్తి, మండల పార్టీ అధ్యక్షులు కురుబ హనుమంతు, కాదలూరు మోహన్ రెడ్డి, కాలువ సన్నన్న, వన్నారెడ్డి, కురుబ మల్లెన్న ,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ దానవేంద్ర, కార్పొరేషన్ డైరెక్టరులు ఉప్పర ఆనంద్, పోరాళ్ల పురుషోత్తం, మాజీ కార్పొరేషన్ డైరెక్టర్ టoకసాల హనుమంతు, మాజీ కౌన్సిలర్లు బండి భారతి, ప్రశాంతి, వేణు, గుద్దిటి లోకేష్, ఎంపీటీసీలు తలారి గంగాధర్, మొండి మల్లికార్జున, సుదర్శన్, రమేష్, కరెన్న, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor