కర్నూలు జిల్లా.. ఆలూరు మండలం
- పెద్ద హోతూరు అంగన్ వాడి కార్యకర్త లేపాక్షి ను పరమర్శించిన ఎమ్మెల్యే విరుపాక్షి..
- టిడిపి గుండాల దౌర్జన్యలకు అడ్డులేకుండా పోయింది…
- మహిళలపై వేధింపులు చేయడం టిడిపి నాయకులకు అలవాటు అయ్యింది..
- టీడీపీ మహిళా ఇంచార్జ్ ఉండి తన అనుచరుడు మహిళపై వేధింపులు చేస్తే అరెస్టు చేయంచలేదు..
- గ్రామాల్లో టీడీపి గుండాలను పెంచి పోషిస్తున్న ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి…
- రాత్రి ప్రభుత్వ ఆసుపత్రి కి నిందితుడు వచ్చాడని బాధితురాలు చెబుతుంది.
- ఆలూరు లో పోలీసుల వైపల్యం ఘోరంగా ఉంది..
కర్నూలు జిల్లా ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామనికి చెందిన అంగన్ వాడి కార్యకర్త లేపాక్షి ని అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు వీరేష్ అసభ్య పదజాలంతో దుషిస్తూ పలుమార్లు అంగన్ వాడి పౌస్టిక ఆహారాన్ని అమ్ముకున్నావంటూ లేనిపోని ఆరోపణలు చేస్తూ వేధింపులకు పాల్పడడంతో ఆమె నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే ఇంత జరిగినా నిందితుడు రాత్రి మళ్ళీ ఆసుపత్రి కి చేరుకొని ఆమె దగ్గరకు రాగా కుటుంబ సభ్యులు అరిచేలోపు పారిపోయాడని వారు తెలిపారు. ఆలూరు లో పోలీసుల వైపల్యం కనపడుతుందని టీడీపీ ఇంచార్జ్ మహిళ అయి ఉండి సాటి మహిళా ఉద్యోగి పై తన అనుచరుడు వేధింపులు చేస్తే అరెస్టు చేయించలేకపోయారని అన్నారు. ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి ఇటీవల తన పుట్టినరోజు న నిందితుడు దిగిన ఫొటోలను మీడియాకు చూపించారు. నియోజకవర్గంలో టిడిపి గుండాలు ఇసుక మాఫియా ఇటీవల గూళ్యం లో అటవీభూములను సాగు చేసుకున్న విషయం పత్రికలో వచ్చిందని తెలిపారు. ఇలా టిడిపి గుండాలు అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని అన్నారు. అంగన్ వాడి కార్యకర్త లేపాక్షి ని పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు.
