పత్తికొండలో ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల…

  • పత్తికొండలో ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల
  • విజయవంతమైన
    సుపరిపాలన సందర్భంగా పాలాభిషేకం

ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తైన సందర్భంగా పత్తికొండ మండల పరిధిలోని స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద ఘనంగా పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు.
బీజేపీ జిల్లా అధ్యక్షులు అక్కమ్మ  తోట రామకృష్ణ చేతుల మీదుగా ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమం పత్తికొండ బీజేపీ మండల అధ్యక్షుడు కరణం నరేష్ ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ వరుసగా ప్రధానమంత్రిగా ఎన్నికై అత్యధిక కాలం దేశానికి సేవలందించిన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ప్రధాని నెహ్రూ రికార్డును ఈరోజుతో అధిగమిస్తూ 4,399 రోజుల నిరంతర ప్రజాసేవతో నరేంద్ర మోదీ గారు దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
అలాగే 12 ఏళ్ల ఈ ప్రగతి ప్రస్థానంలో దేశాన్ని స్వావలంబన, సాధికారత దిశగా ముందుకు నడిపిస్తూ, ప్రపంచ దేశాల ముందు భారత్‌ను అజేయ శక్తిగా నిలబెట్టిన నాయకుడిగా మోదీ గారు నిలిచారని కొనియాడారు. దేశ అభివృద్ధి, జాతీయ గౌరవం, ప్రజా సంక్షేమం కోసం ఆయన అందిస్తున్న సేవలు చిరస్మరణీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ
కో కన్వీనర్ గోవర్ధన్ నాయుడు,జిల్లా అధికార ప్రతినిధి బ్రహ్మయ్య, ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి  రామాంజనేయులు, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్వాక సభ్యులు దండి మల్లికార్జున, సీసీ రంగన్న, మండల ప్రధాన కార్యదర్శి మాలేఖరి వీరేష్, యువ మోర్చా నాయకులు బాబ్జి గౌడ్, బిజెపి జిల్లా కార్యవర్గం సభ్యులు శంకరయ్య ఆచారి, లీగల్ సెల్ కన్వీనర్ అడ్వకేట్ భాస్కర్, ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు హరీష్ నాయక్  ఓబిసి మోర్చా జిల్లా కార్యవర్గ రాంపల్లి రంగయ్య, యువ నాయకులు బాబ్జి గౌడ్,శంకర్ బాబు, రవీంద్ర కుమార్, మనోహర్ చౌదరి, భగవాన్ రావు, రామ్మోహన్, బృహన్ గౌడ్, సురేంద్ర, తదితరులు  పాల్గొన్నారు.

Editor