Latest Posts

గోపేపల్లి గ్రామంలో స్వచ్ఛ పథం కార్యక్రమం.

గోపేపల్లి గ్రామంలో స్వచ్ఛ పథం కార్యక్రమం
శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లి గ్రామ ప్రధాన రహదారిపై ఈరోజు స్వచ్ఛ పథం కార్యక్రమం నిర్వహించబడింది. గ్రామ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కార్యక్రమంలో డీడీఓ రఘునాథ్ గుప్తా, ఎంపీడీఓ అంజినప్ప, గోపేపల్లి ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ తేజస్విని పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి పునాది అని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు స్వచ్ఛతను తన బాధ్యతగా భావించి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor