నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు..

నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలను బుట్టి నాగభూషణం నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోగులకు బ్రెడ్‌లు, పండ్లు పంపిణీ చేశారు.

నాగభూషణం నాయుడు మాట్లాడుతూ బాలకృష్ణ సేవాగుణానికి ప్రతిరూపమని, ఆయనను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Posted Under AP
Editor