బ్యాంకర్లు మెరుగైన సేవలందించాలి….
జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
అనంతపురం, జూన్ 10: ప్రజలకు ఆయా బ్యాంకుల ద్వారామెరుగైనసేవలందించాలని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్
సూచించారు.
బుధవారం ఉదయం అనంతపురం సంగమేష్ నగర్ లో యూనియన్ బ్యాంక్
ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ మరియు రిటైల్ లోన్ మంజూరుఆయావిభాగాలను
జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ
బలోపేతానికి బ్యాంకులు మరింత చురుకైన పాత్ర వహించాలని అలాగే వివిధ సబ్సిడీ ఆధారిత రుణాల ను మంజూరు చేస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రైతులు, నిరుద్యోగ యువత స్వయం సహాయకమహిళాబృందాలకు తగినంతగా ప్రోత్సహించా
లన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధపథకాలఅమల్లోభాగంగా అర్హులైన లబ్ధిదారులకు ప్రోత్సహించాలన్నారు. వినియోగదారులు సంతృప్తి చెందేవిధంగాఆయాబ్యాంకుల ద్వారాసేవలందించాలన్నారు.
నేడు నగరంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ విభాగాలు ప్రారంభించడం శుభపరిణామం అని, యూనియన్ బ్యాంకు ద్వారా హౌసింగ్ ,వాహనాలు,మరియు ఇతర రుణ మంజూరు సేవలను మరింతంగాప్రజలకు చేరువగా అందించడం ఎంతో అభినందనీయమని అన్నారు.
వివిధ రకాలుగా ప్రజలకు మెరుగైన సేవలు అందించే కార్యక్రమంలోతానుపాల్గొనడం తనకేంతో సంతోషంగా ఉందన్నారు.
జిల్లాలో సుమారు 25 లక్షల దాకా జనాభా ఉన్న నేపథ్యంలో అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించడం సవాలుగా మారుతున్నదని పేర్కొన్నారు. అందువల్ల ప్రజలు వ్యవసాయంమరియు వ్యవసాయఅనుబంధరంగాలపై ప్రత్యేక దృష్టిని సారించి ఉత్పత్తులకు విలువ జోడింపు ద్వారా ఆదాయ అవకాశాల
ను పెంచుకొని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. దీనికి అవసరమైన క్రెడిట్ సదుపాయాలను బ్యాంకులు అందించడంఎంతోముఖ్యమని అలాగే బ్యాంకులన్నీప్రజల ఆర్థికఅభివృద్ధిలో కీలకపాత్ర పోషించాలని కోరారు. పీఎంఈజీపిపథకంద్వారా రుణాల దరఖాస్తు చేసుకునే అవకాశాలు పరిమితంగా ఉండటం వల్ల ఎక్కువ మంది లబ్ధిదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చునని కలెక్టర్ సూచించారు. అలాగే ఈ పథకం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో చిన్న వ్యాపారస్తులకు ప్రోత్సాహం లభించడంతోపాటు సబ్సిడీ సౌకర్యంకూడాఅందుబాటులో ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అంతేగాక దీనివల్ల కస్టమర్లకు రుణ సౌకర్యం సులభతరం అవుతుందని బ్యాంక్ అధికారులకు కూడా ఎలాంటి ఒత్తిళ్లు లాంటి పని భారం ఉండదని తెలిపారు. బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలుఉన్నప్పటికీలబ్ధిదారులకు ఇబ్బంది పెట్టకుండా అర్హులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తగినంతగా సహకరించాలన్నారు. పెట్టుబడి రూపంలోరుణాలు వృద్ధి చెందే విధంగా బ్యాంకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని కృషి చేయాలన్నారు. ఏపీఐఐసీ ద్వారా అనంతపురం జిల్లాలో పరిశ్రమ స్థాపన కొరకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు భూ కేటాయింపులు పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక ఎం ఎస్ ఎం ఈ పార్క్ ల ఏర్పాటుకు చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో కూడేరు గ్రామం, కళ్యాణ్ దుర్గం మండలం తిమ్మసముద్రం, తాడిపత్రి మండలం ఊరి చింతల వద్ద ప్రస్తుతం రోడ్లు డ్రైనేజీ విద్యుత్ సరఫరా తదితర పనులు జరుగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఎమ్ ఎస్ ఎం ఇ స్థాపనలో ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక భూ సమస్యలను అధిగమించి వృద్ధి చెందే విధంగా తోడ్పాటు అందించాలన్నారు
అలాగే అనంతపురం జిల్లాకు కేటాయించిన సుమారు 200 దాకా ఉన్న ఎఫ్ పి ఓ ల అభివృద్ధికి బ్యాంకులు సహకరించాలని పీఎం ఎఫ్ఎంఈ పథకం అమలుకు అలాగే ఎం ఎస్ ఎం ఈ రంగం అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించే విధంగా రుణ సదుపాయాలను మరింత చేరువ చేయడానికి సమిష్టి కృషి ఎంత అవసరమన్నారు. నేడు ప్రారంభించిన ఈ విభాగాల తో ప్రజలు వ్యాపారవేత్తలు వినియోగదారులకు వేగవంతమైన నాణ్యమైన సులువతరమైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా జిల్లా కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి జోనల్ జనరల్ మేనేజర్ శ్రీ పత్రి శ్రీనివాస,
అనంతపురం రీజినల్ హెడ్ వంశీకృష్ణ, ఆర్ ఎల్ పి విభాగం కొసిగి వెంకటేశ్వర్లు, శ్రీహరి, పలువురు బ్యాంకు అధికారులు ఉద్యోగ సిబ్బంది వ్యాపారవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.
