పెనుకొండలో భారీ ఈదురుగాలుల బీభత్సం…

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. ఈదురుగాలుల ధాటికి దర్గా సర్కిల్‌లో ఉన్న భారీ వేపచెట్టు కూలిపోగా, ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. చెట్టు కూలడంతో విద్యుత్ వైర్లు తెగిపడి, పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది…

పెనుకొండ పట్టణంలో సోమవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గాలుల తీవ్రతకు దర్గా సర్కిల్‌లో రహదారి పక్కన ఉన్న భారీ వేపచెట్టు ఒక్కసారిగా నేలకొరిగింది.
చెట్టు కూలిన సమయంలో అక్కడ వాహనాలు, ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే చెట్టు కూలడంతో సమీపంలోని విద్యుత్ వైర్లపై పడటంతో పలుచోట్ల వైర్లు తెగిపోయాయి.

విద్యుత్ వైర్లు దెబ్బతినడంతో పెనుకొండ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని చెట్టును తొలగించే పనులు చేపట్టారు.

Posted Under AP
Editor