Latest Posts

10 లక్షలతో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు – ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

.10 లక్షలతో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు – ప్రారంభించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం పట్టణ ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు.
రాయదుర్గం పట్టణంలోని 30వార్డుల్లో తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ సమ్మర్ స్టోరేజి ద్వారా తాగునీరు సరఫరా అవుతుండగా, 28వ మరియు 29వ వార్డుల ప్రజలకు ఇప్పటి వరకు బోర్‌వెల్ ద్వారా మంచి నీటినే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు వార్డుల ప్రజలకు కూడా సమ్మర్ స్టోరేజి ద్వారా నాణ్యమైన తాగునీరు అందించేందుకు ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని సుమారు రూ.10 లక్షల వ్యయంతో కొత్త పైప్‌లైన్ ఏర్పాటు చేయించారు.
ఈ పైప్‌లైన్ ద్వారా తాగునీటి సరఫరాను సోమవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అంశమని చెప్పారు. పట్టణంలోని ప్రతి వార్డుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.
ఇప్పటి వరకు బోర్‌వెల్ నీటిపై ఆధారపడిన 28, 29వ వార్డుల ప్రజలకు ఇకపై సమ్మర్ స్టోరేజి ద్వారా నీరు అందనున్నందున తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.

Posted Under AP
Editor