ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ స్కూల్‌కు గుర్తింపు
శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ:
ముదిగుబ్బలోని ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు సంబంధిత విద్యాశాఖ అధికారులు సమగ్ర పరిశీలన అనంతరం సవరించిన ఓపెనింగ్ పర్మిషన్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి (DSEO) అధికారిక గుర్తింపు మంజూరు చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.
ప్రస్తుతం పాఠశాల ప్రభుత్వం నిర్దేశించిన అన్ని నిబంధనలు, ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించబడుతోందని, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని యాజమాన్యం పేర్కొంది. తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరింది.
