రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనంతపురము….

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనంతపురము.

ప్రకృతి వనరులను సంరక్షించాలన్న ప్రధాని పిలుపుతో “గ్యాస్‌మిత్ర” రూపొందించిన 14 ఏళ్ల యువ ఆవిష్కర్త

భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన ప్రకృతి వనరుల సంరక్షణ మరియు ఇంధనాన్ని బాధ్యతాయుతంగా వినియోగించాలన్న పిలుపుతో స్ఫూర్తి పొంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 14 ఏళ్ల యువ ఆవిష్కర్త గంధం ధీరజ్ “గ్యాస్‌మిత్ర” అనే బహుభాషా LPG వినియోగదారుల అవగాహన పై మొబైల్ అప్లికేషన్ రూపొందించారు, ఈ వేడుక రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అనంతపురము స్పోక్ కార్యాలయ స్పోక్ సీ ఈ ఓ డా.ఆర్ హఫీజ్ భాష ప్రారంభించారు.

ఈ గ్యాస్‌మిత్ర ద్వారా LPG బుకింగ్ అర్హత కాలిక్యులేటర్, గ్యాస్ లీకేజీ భద్రత సూచనలు, గ్యాస్ పొదుపు చిట్కాలు, DAC మోసాలపై అవగాహన వంటి సేవలను అందిస్తున్నారు. అదనంగా, ఈ వేదికలో 12 భారతీయ భాషలకు వాయిస్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.

ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే, దీన్ని రూపొందించిన గంధం ధీరజ్ 8వ తరగతి చదువుతున్న సమయంలో సాధారణ పాఠశాల విద్యను విడిచిపెట్టి ప్రస్తుతం ఇంటి వద్ద స్వయంగా చదువుకుంటూ టెక్నాలజీ మరియు ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నారు.

సామాన్య ప్రజల్లో LPG భద్రత, పొదుపు మరియు సైబర్ మోసాలపై అవగాహన పెంచేందుకు సులభమైన సాంకేతిక వేదికగా గ్యాస్‌మిత్రను రూపొందించినట్లు ధీరజ్ తెలిపారు.

గ్యాస్‌మిత్ర మొబైల్ మరియు వెబ్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది.

వెబ్‌సైట్: gasmitra.org

రూపొందించిన వారు:
గంధం ధీరజ్
14 ఏళ్ల యువ ఆవిష్కర్త
శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్

Posted Under AP
Editor