స్వచ్ఛ రాయదుర్గం లక్ష్యంగా పని చేయాలి……

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

స్వచ్ఛ రాయదుర్గం లక్ష్యంగా పని చేయాలి

– : అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో ఒకరోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

– ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాయదుర్గం మున్సిపాలిటీలో చేపట్టిన ఒకరోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ను జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ తనిఖీ చేశారు.

– ఈ సందర్భంగా మీడియాతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీలలో ఒకరోజు ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించడం జరిగిందని, ప్రతిరోజు శానిటేషన్ సిబ్బంది పారిశుధ్య పనులు చేస్తుంటారని, కానీ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 24 గంటల సమయంలో ఎక్కడైతే మనకు కనిపించే కుప్పలు ఉన్నాయో అవన్నీ ఒకరోజు ఇంటెన్సివ్ గా చెత్త తీయాలనే ఉద్దేశంతో శానిటేషన్ డ్రైవ్ చేయటం జరిగిందన్నారు. రాయదుర్గంలో పలు చోట్ల ఇంటెన్సివ్ శానిటేషన్ డ్రైవ్ ని తనిఖీ చేశామన్నారు. రాయదుర్గంలో సుమారు లక్ష టన్నుల దాకా బయో-రెమిడియేషన్ జరుగుతున్నాయని, దానిలో 25,000 టన్నులు ఇప్పటికి కాగా, ఇంకా 75,000 టన్నుల దాకా చేయాల్సినవి ఉన్నాయని, వచ్చే ఒకటీ రెండు నెలల్లో బయో-రెమిడియేషన్ పనులు పూర్తి చేసుకోవడం జరుగుతుందన్నారు. చాలా చోట్ల ప్రజలు తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకునే దిశలో ఏవైతే షాపుల నుంచి తీసుకున్న ప్లాస్టిక్ వ్యర్థాలు తదితర రకరకాల ఐటమ్స్ కావచ్చు వాటిని సైడ్ డ్రైన్స్‌లో పారేయడం జరుగుతోందని, ప్రజలు కూడా కొంతవరకు మున్సిపల్ సిబ్బందికి సహకారం అందిస్తే ‘స్వచ్ఛ ఆంధ్ర’ అనే కార్యక్రమం ద్వారా స్వచ్ఛ రాయదుర్గం సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, ఇందుకు ప్రజల సహకారం అందించాలని కోరారు. చాలా చోట్ల వేకెంట్ ల్యాండ్ (ఖాళీ స్థలాలు)లో చెత్తకుప్పలు కనిపిస్తున్నాయని, ఖాళీ స్థలాలలో ఎక్కడ కూడా చెత్తకుప్పలు పెట్టుకోవడానికి వీల్లేదని, అలాచేస్తే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని, వాళ్ళ మీద పెనాల్టీలు వేయడానికి కూడా చట్ట ప్రకారం అవకాశం ఉందన్నారు. ఖాళీ స్థలాల్లో చెత్త కుప్పలు కనిపిస్తే అలాంటి వారికి నోటీస్ లు పంపాలని మున్సిపల్ కమిషనర్‌కి ఆదేశం ఇవ్వడం జరిగిందన్నారు. ఖాళీ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవడం ఆ స్థలం యజమాని బాధ్యత అని, వారు ఆ స్థలాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కమర్షియల్ షాపుల దగ్గర ఒక వేస్ట్ బిన్ ఖచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. కమర్షియల్ వీధుల్లో అయితే రెగ్యులర్‌గా ఆ వేస్ట్ బిన్స్‌ని తొలగించేలా మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుంటారన్నారు. ఖాళీ స్థలాలను శుభ్రం చేసుకోవాలని, కమర్షియల్ షాపుల వారు చెత్త లేకుండా ఉండేలా చూసుకోవాలని వాళ్లకి తెలియజేసేలా ఐ.ఈ.సి క్యాంపెయిన్ చేపట్టడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఎవరైనా పాటించని పరిస్థితిలో ఖచ్చితంగా పీనల్ ప్రొవిజన్ చేయాల్సిన అవసరం ఉంటుందని, ఇందుకు అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తహసీల్దార్ హరికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor