ముదిగుబ్బ: భూమి వివాదంలో నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురికి రూ.50,000 జరిమానా

ముదిగుబ్బ, యస్ 9
ముదిగుబ్బ మండలం రఘవపల్లి గ్రామ పరిధిలో భూమి రస్తా వివాదానికి సంబంధించి శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం ముందస్తు చర్యలలో భాగంగా సంబంధిత వ్యక్తులను బౌండోవర్ చేసినట్లు ముదిగుబ్బ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అయితే, పెన్నబడి లేపాక్షి, పెన్నబడి రామ్మోహన్, పెన్నబడి తిరుమలయ్య, పెన్నబడి శ్రీరాములు మరియు పెన్నబడి నారాయణస్వామి లు పోలీసుల హెచ్చరికలను లెక్కచేయకుండా వివాదాస్పద భూమి వద్దకు వెళ్లి గొడవలకు పాల్పడిన కారణంగా, వారి పై ముదిగుబ్బ పోలీస్ స్టేషన్‌లో క్రైం నంబర్లు 21/2025 మరియు 22/2025 కింద క్రిమినల్ కేసులు నమోదు చేయబడినట్లు తెలిపారు.ఇదివరకు వీరందరిని భూమి వివాదం కారణంగా శాంతిభద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు బౌండోవర్ చేయడం జరిగిందని, అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా BNSS సెక్షన్ 130 ప్రకారం ముదిగుబ్బ మండల తహసీల్దార్ గారు స్పందించి పై పేర్కొన్న ఐదుగురికి ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున జరిమానా విధించి వారి వద్ద నుండి మొత్తం రూ.50,000/- ప్రభుత్వ ఖాతాలో జమాచేసినట్లు తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని ముదిగుబ్బ పోలీస్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

Posted Under AP
Editor