Latest Posts

నల్లమాడ మండలం కుటాలపల్లి రోడ్డులో ప్రమాదం: కుక్కలు అడ్డు రావడంతో దంపతులకు తీవ్ర గాయాలు

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని కుటాలపల్లి రోడ్డు లో ప్రమాదం చోటుచేసుకుంది. కుటాలపల్లి గ్రామానికి చెందిన మాధవరెడ్డి, ఆయన భార్య శాంతమ్మ ద్విచక్ర వాహనంపై తమ ఇంటికి వెళ్తుండగా అకస్మాత్తుగా కుక్కలు అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా వారిని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స అందించిన అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు రిఫర్ చేశారు.

Posted Under AP
Editor