ఉరవకొండలో హంద్రీనీవా కాలువ లైనింగ్ పనుల తనిఖీ: నాణ్యతలో రాజీ పడొద్దని కలెక్టర్ ఓ. ఆనంద్ ఆదేశం

అనంతపురం జిల్లా, ఉరవకొండ.

*ఉరవకొండ మండలం పరిధిలో హంద్రీనీవా కాలువ లైనింగ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్*

– *అనంతపురము జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఉరవకొండ మండలం పరిధిలోని హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాలువ లైనింగ్ పనులను క్షేత్రస్థాయిలో శుక్రవారం ఉదయం తనిఖీ చేశారు. జిల్లాలో సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా, ఈ కాలువ లైనింగ్ పనుల పురోగతిని ఆయన స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.*

– *ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు గత సంవత్సరం చేపట్టడం జరిగిందనీ, ప్యాకేజ్ 88 నుండి 216.3 కిలోమీటర్ల పొడవునా కర్నూలు, అనంతపురం జిల్లాలో హంద్రీనీవా జలాలు ప్రవాహం ఉంటుందని, ఇందులో మన అనంతపురం జిల్లాలో 144 కి.మీ నుండి 216.3 కి.మీ పొడుగునా విస్తరించి ఉందని తెలుపుతూ ఇందులో ఎక్కడ కూడా గండ్లు పడకుండా సీపేజీ లీకేజీ లేకుండా లైనింగ్ పనులు జిల్లాలో 82 కిలోమీటర్ల పరిధిలో 6.50 కిలోమీటర్ల కాలువ లైనింగ్ పనులు గుర్తించి వాటి పనులు పురోగతిలో ఉన్న నేపథ్యంలో ఉరవకొండ మండలం కౌకుంట్ల, రామాపురం పరిధిలో జరుగుతున్న లైనింగ్ పనులను పరిశీలించడం జరిగిందని తెలిపారు.*

– *సాగు నీరు రైతులకు ఇబ్బంది కాకుండా ఉండేందుకు వీటిని అత్యంత నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని అధికారులను మరియు కాంట్రాక్టర్ ను కలెక్టర్ ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాలని స్పష్టం చేశారు.*

– *ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గుంతకల్ డివిజన్ శ్రీనివాస్ నాయక్,కాంట్రాక్టర్ ప్రతినిధి రామకృష్ణ యాదవ్, డిఈఈ రమణ, ఏఈలు సుదర్శన్ మూర్తి, రెవెన్యూ తదితర అధికారులు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor