కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం..

*పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా).*
15.05.2026.

*కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం..*

*శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టును ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ-డీఆర్డీఓ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి శుక్రవారం ఉదయం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి విమానాశ్రయానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేరుకున్నారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో కేంద్ర రక్షణ మంత్రి గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్, తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు. కేంద్ర రక్షణ మంత్రి గారికి స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్, రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ.భరత్, రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, చేనేత మరియు జౌలి శాఖ మంత్రివర్యులు శ్రీమతి ఎస్.సవిత, రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, హిందూపురం, అనంతపురం ఎంపీలు బికే.పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పల్లె సింధూరరెడ్డి, ఎంఎస్.రాజు, కందికుంట వెంకట ప్రసాద్, అమిలినేని సురేంద్రబాబు, గుమ్మనూరు జయరాం, దగ్గుపాటి ప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, తదితరులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, తదితరులు పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతం పలికారు.*

Posted Under AP
Editor