తాడిమర్రి (yes9tv )చీనీ తోటల్లో పోలుసు పురుగు నియంత్రణపై అవగాహన
ఈ రోజు తాడిమర్రి మండలంలోని శివంపల్లి, మెడిమేకలపల్లి, ఎం. అగ్రహారం గ్రామాలతో పాటు ధర్మవరం మండలంలోని గొట్లూరు, బత్తలపల్లి మండలంలోని సంజీవపురం గ్రామాలలోని చీనీ తోటలను కేంద్ర సమగ్ర సస్యరక్షణ కేంద్రం, విజయవాడ నుండి సంయుక్త సంచాలకులు శ్రీ ఎం.పీ. గోస్వామి, సహాయ సంచాలకులు శ్రీ కె.వి. చౌదరి మరియు సస్యరక్షణ అధికారి శ్రీ పి. మను గారు సందర్శించారు.
ఈ సందర్భంగా రైతులకు పోలుసు పురుగు (స్కేల్ ఇన్సెక్ట్) వల్ల కలిగే నష్టాలు, దాని నివారణకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా సమయానికి మందుల పిచికారీ, తోట పరిశుభ్రత, బాధిత కొమ్మల తొలగింపు వంటి నివారణ చర్యలను పాటించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ధర్మవరం ఉద్యాన అధికారిణి అమరేశ్వరి గారు, తాడిమర్రి, ధర్మవరం, బత్తలపల్లి మండలాల ఉద్యాన సహాయకులు గౌతమి, ప్రవల్లిక, ఆశ, చారిత గారు పాల్గొన్నారు.
చీనీ తోటల్లో పోలుసు పురుగు నియంత్రణపై అవగాహన…
