కొడుకు మరణాన్ని జీర్ణించు కోలేక తల్లి మరణం శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం మండల పరిధిలో ఉన్న గోపేపల్లి గ్రామం లో ఉండే చెరువు చాంద్ బాషా భార్య సకినా ఈ రోజు మధ్యాహ్నం ఇంటిలో ఎవరు లేని సమయం లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది వెంటనే ఆమెను కదిరి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించడం జరిగింది కానీ ఆమె అప్పటికే మరణించిదని వైద్యలు సూచించారు. ఇటీవల కాలంలో సకినా కొడుకు హైదర్ బాషా ముదిగుబ్బ దగ్గర బైక్ ప్రమాదం లో మరణించినాడు అప్పటినుండి తీవ్ర మనోవేదన తో రోజు బాధ పడుతూ ఉండేది. కొడుకు మరణాన్ని జిర్ణించుకోలేక తల్లి కూడా మరణించడం తో ఆ కుటుంబం లో విషాదం లో మునిగి పోయింది ఆమెకు భర్త ఒక కూతురు ఉన్నారు
కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి ఆత్మహత్య: గోపేపల్లి గ్రామంలో విషాదం
