Latest Posts

బి.టి.పి ఆయకట్టు పరిధిలో ఆశాజనకంగా వరి సాగు: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం – ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం.

సకాలంలో నీరు ఇవ్వడంతో ఆశాజనకంగా వరి సాగు

* రైతుల అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
* ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టు అయిన భైరవాణి తిప్ప ప్రాజెక్టు ఆయకట్టు కింద ఈ ఏడాది ఆశాజనకంగా వరి సాగైందని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు.
బి టి పి నుంచి సకాలంలో నీరు విడుదల చేయడంతో రైతులు పంటలు బాగా పండించారన్నారు.
గుమ్మగట్ట మండలంలోని కలుగోడు గ్రామంలో రైతులు సాగుచేసిన వరి పంట పొలాలను మండల తెదేపా నాయకులు, ప్రజా ప్రతినిధులు, నీటి పారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కాలవ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ మీడియాతో మాట్లాడారు.
రాయదుర్గం నియోజకవర్గంలో రబీలో 1,14,704 ఎకరాల్లో వివిధ రకాల పంటలు రైతులు సాగు చేశారన్నారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం వరి మద్దతు ధర క్వింటాలుకు రూ. 2380/ ప్రకటించగా, బహిరంగ మార్కెట్లో రూ. 2450 ధరలు పలుకుతున్నాయన్నారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు.
రైతుల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Posted Under AP
Editor