***వినియోగదారులకు అవగాహన కల్పించిన ఇన్,స్పెక్టర్ శంకర్***
ఉరవకొండ లో శనివారం రోజున తునికలు కొలతల శాఖ డివిజనల్ ఇన్,స్పెక్టర్,శంకర్, తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా మటన్ చికెన్ చాపల మార్కెట్ పండ్లు కూరగాయలు పూల వ్యాపారాల తూనికల యంత్రాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో సీలు లేని యంత్రాలు రాళ్లును సీజ్ చేసామని తెలియజేశారు. అలాగే చికెన్ షాపులకు వెళ్లి యంత్రాలను పరిశీలించగా సీలు లేని చికెన్ షాప్ కు 3500 రూపాయలు జరిమానా విధించామని విలేకరులకు తెలియజేశారు.
