మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోండి
– : ఈనెల 11వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహణ
– : సోమవారం ఉదయం 9:00 నుండి పిజిఆర్ఎస్ నిర్వహణ..
– : రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో “మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100” అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయాలి
– : జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– : జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్
అనంతపురం, మే10 :
– మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ నందు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ పరిధిలోని అన్ని ఫిర్యాదుల పరిష్కార అధికారుల కార్యాలయాలలో “మీకోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1100” అనే బ్యానర్‌ను ఏర్పాటు చేయాలన్నారు.
ఈనెల 11వ తేదీన కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహణ :
– ఈనెల 11వ తేదీన సోమవారం అనంతపురం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని రెవెన్యూ భవనంలో ఉదయం 9:00 నుండి నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. వడగాలుల అంచనా మరియు ప్రస్తుతం నెలకొన్న అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా, మరియు ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు మరియు మహిళలు సుదూర గ్రామాలు మరియు మండలాల నుండి వస్తున్నందున, ప్రజా భద్రత దృష్ట్యా మరియు వడదెబ్బను నివారించడానికి, సోమవారం ఉదయం 9:00 నుండి పిజిఆర్ఎస్ గ్రీవెన్స్ డేను నిర్వహించడం జరుగుతుందన్నారు.
– ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ వివరాలతో పాటు వారి సమస్యలకు సంబంధించి అర్జీలను అందజేయాలన్నారు. అర్జీదారులు గతంలో ఇచ్చిన అర్జీలకు సంబంధించిన స్లిప్పును తీసుకురావాలని సూచించారు. సమస్య పరిష్కారమైనప్పుడు ఫోన్ కి మెసేజ్ వస్తుందని, అర్జీదారులు వారి ఫోన్ ను చెక్ చేసుకోవాలన్నారు. నోటీసులు, ఎండార్స్మెంట్ ను వాట్స్అప్ లో పంపిస్తున్నామని, ఎండార్స్మెంట్ బై రిజిస్టర్ పోస్ట్ మీరు ఇస్తున్న అడ్రస్ కు పంపిస్తున్నామన్నారు. అర్జీ ఇచ్చేటప్పుడు దానిని కరెక్ట్ గా దానిని పూరించాలన్నారు. రిపీటెడ్ అర్జీదారులు పాత రసీదును తీసుకురావాలన్నారు. జిల్లా ప్రజలు పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమవారం ఉదయం 9:00 నుండి పూర్తి అయ్యే వరకు డివిజన్, మండల మరియు ఎస్.జి.ఎస్.డబ్ల్యూ స్థాయిలలో పి.జి.ఆర్.ఎస్. గ్రీవెన్స్ డేను నిర్వహించాలని ఆర్.డి.ఓలు, తహసీల్దార్లు మరియు పి.డి.ఓలకు సూచించడమైనది.
————————————–
