- సత్య సాయి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి,
- కార్మికుల 6 వ రోజు సమ్మెకు మద్దతు పలికిన సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు
సత్య సాయి కార్మికుల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించి మండలంలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని సిపిఐ పార్టీ నాయకులు చల్లా శ్రీనివాసులు ఆదివారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,
తమ సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రం ముదిగుబ్బలో పంపు హౌస్ సమీపంలో దొరిగల్ రోడ్డులో దీక్ష శిబిరం ఏర్పాటు చేసి 6 వ రోజు సత్య సాయి కార్మికులు కొనసాగించిన సమ్మెకు ఆదివారం సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు సంఘీభావం తెలిపారు, ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కార్మికులు తమ పెండింగ్ వేతనాలు చెల్లించాలని, సత్య సాయి నీటి పథకం నిర్వహణను బోర్డు ద్వారానే కొనసాగించాలనే తదితర డిమాండ్లతో విధులను బహిష్కరించి నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రజా ప్రతినిధులు అధికారులు ఏమాత్రం స్పందించకపోవడం దారుణమన్నారు, రాష్ట్ర మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ తదితరులు రెండు రోజుల కిందట సంబంధిత అధికారుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో వేసకాలంలో తాగునీటి సమస్య నివారించడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ఎక్కడ తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారే గాని నీటి సరఫరా కార్మికుల సమస్యల గురించి ఏమాత్రం చర్చించకపోవడం విచారకరమన్నారు కనుక ఈనెల 15వ తేదీ జిల్లాకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైన ఈ కార్మికుల సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సిపిఐ నాయకులు చల్లా శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు
