హనుమజ్జయంతి మహోత్సవములు 2026…..

*శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం – కసాపురం గ్రా, గుంతకల్లు మం , అనంతపురము జిల్లా.*

*హనుమజ్జయంతి మహోత్సవములు 2026.*
*10.05.2026 ఆదివారము వైశాఖ బహుళ అష్టమి ఉదయం 8-05 నిమిషాల నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం,* *మంటపారాధన, పంచగవ్యప్రాశన , గోపూజ, సుందరకాండ మన్యుసూక్త పారాయణ హోమము , శ్రీరామ ఆంజనేయ మూల మంత్ర అనుష్టానం మరియు సాయంత్రం 5-00 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తికి లక్ష తమలపాకులు అర్చన కార్యక్రమము నిర్వహించిన అనంతరం శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమము నిర్వహించబడింది.*

*ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయరాజు గారు , అనువంశిక ధర్మకర్త శ్రీమతి కె.సుగుణమ్మ గారు , ప్రధాన ఆర్చకులు శ్రీ కె. రాఘవాచార్యులు గారు , వేద పండితులు , అర్చకులు , భక్తులు , గ్రామ ప్రజలు పాల్గొన్నారు.*

Posted Under AP
Editor