శ్రీ సత్యసాయి జిల్లా, కదిరి.
బిజెపి మూడు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలలో విజయకేతనం ఎగరవేసిన సందర్బంగా సంబరాలు చేసుకున్న బిజెపి శ్రేణులు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి భారతదేశంలో ఐదు రాష్ట్రాలలో జరిగిన సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ దాదాపుగా మూడు రాష్ట్రాలలో అత్యధిక మెజారిటీతో గెలిచి విజయ డంకా మోగించిన నేపథ్యంలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో రాక్షస పాలనను వీడి ప్రజలు భారతీయ జనతా పార్టీకి దాదాపుగా 200 పైచిలుకు సీట్లను గెలిపించిన నేపథ్యంలో కదిరి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వీట్లు పంచి సంబరాలు చేసుకోవడం జరిగింది. దేశ ప్రజలు నరేంద్ర మోడీ మీద బిజెపి ప్రభుత్వం పైన ఉన్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు అని తెలిపారు. పశ్చిమ బెంగాల్ లో అంతరాష్ట్ర పార్టీలకు స్వస్తి పలకాల్సిన సమయం దగ్గర పడిందని బిజెపి పార్టీకి పట్టం కట్టరన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తలుపుల గంగాధర్, పట్టణ అధ్యక్షడు పీట్ల రామకృష్ణ పాల్గొన్నారు.
ఇట్లు
పీట్ల రామకృష్ణ
పట్టణ అధ్యక్షుడు
భారతీయ జనతా పార్టీ
