Latest Posts

పెట్రోల్, డీజిల్ కొరతపై వైస్సార్సీపీ నిరసన – వెంటనే సరఫరా చేయాలని డిమాండ్

నార్పల(yes9tv)పెట్రోల్, డీజిల్ కొరతపై వైస్సార్సీపీ నిరసన – వెంటనే సరఫరా చేయాలని డిమాండ్
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ డిమాండ్ చేశారు.
వైస్సార్సీపీ పార్టీ ఆదేశాల మేరకు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా “అసమర్థ ప్రభుత్వం డౌన్ డౌన్” అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డా. శైలజానాథ్ మాట్లాడుతూ, ఇంధనం అందుబాటులో లేక ప్రజలు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొన్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం దురదృష్టకరమని విమర్శించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. లేదంటే ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో కన్వీనర్లు మహేష్ రెడ్డి, ఎల్లారెడ్డి, ఎంఎపీపీ నాగేశ్వరావు, జెడ్పీటీసీ భాస్కర్, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు పట్నం ఫణీంద్ర, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు మంత్రి ఆంజినేయులు, ఇంటిలెక్చువల్ సెల్ అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు ప్రభుదాస్, జిల్లా కార్యదర్శి సాకే రామాంజనేయులు, నాయకులు బాలనాగి, బయన్న, శంకర్ యాదవ్, వెంకటరామిరెడ్డి, పక్కిరెడ్డి, రంగయ్య, శివశంకర్ రెడ్డి, నాగరాజు, శివారెడ్డి, ఎంఎస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

Posted Under AP
Editor