గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన..

విశాఖ :

* గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం మాట్లాడిన అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ
* 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణం ద్వారా ఏఐ రంగంలో భారత్ ఓ పెద్ద ముందడుగు వేసింది
* కంప్యూటర్ రంగంలో ఈ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో విశాఖ అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది
* ఇప్పటి వరకూ ముంబై, చెన్నై లోనే పరిమితమైన డేటా సెంటర్ లు ఇక విశాఖలోకి అడుగు పెట్టాయి
* విశాఖ నగరం ఇక భారత కొత్త డిజిటల్ గేట్ వేగా మారుతుంది
* భారత్ తో పాటు అంతర్జాతీయంగా వివిధ ప్రాంతాలకు ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది
* సీఎం చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్ నేతృత్వంలో డిజిటల్ ఇన్ ఫ్రా వేగంగా నిర్మితం అవుతుంది
* విశాఖ నగరం ఏఐ రివల్యూషన్ కు నాంది పలికింది
* 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని అదానీ గ్రూప్ నిర్ణయించింది
* ఎక్కువ మంది ప్రజలకు, వాణిజ్యానికి, పరిశ్రమలకు ఏఐ సేవలు అందించాలన్నదే మా ఆలోచన

* జీత్ అదానీ,
* అదానీ గ్రూప్ చైర్ పర్సన్

Posted Under AP
Editor