Latest Posts

ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన..

ధర్మవరం(Yes9tv)ధర్మవరం నియోజకవర్గంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పర్యటన
ధర్మవరం, ఏప్రిల్ 29:
గౌరవ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు ఏప్రిల్ 29 (బుధవారం) ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వారి పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ఉదయం 6:00 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మడుగుతేరు కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 9:00 గంటలకు సంజయ్ నగర్‌లోని ఫైర్ స్టేషన్ వద్ద నూతన ఫైర్ ఇంజన్ వాహనాన్ని ప్రారంభిస్తారు.
ఉదయం 10:00 గంటలకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ సిఎస్‌ఆర్ నిధులతో ధర్మవరం పోతుకుంట ఏరియా హాస్పిటల్‌కు అందించిన వైద్య పరికరాలను పరిశీలిస్తారు.
ఉదయం 10:30 గంటలకు పోతుకుంట ఏరియా హాస్పిటల్‌లో నిర్వహిస్తున్న ఉచిత కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 11:30 గంటలకు ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
మధ్యాహ్నం 3:00 గంటలకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు

Posted Under AP
Editor