అఖిల్ ఏజెంట్ పై వస్తున్న విమర్శలు.. ట్రోల్స్ అన్నిటిని యాక్సెప్ట్

ఖిల్ ఏజెంట్ పై వస్తున్న విమర్శలు.. ట్రోల్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ ఆ సినిమా నిర్మాత అనిల్ సుంకర లేటేస్ట్ గా తన సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పెట్టారు.

సినిమా అంచనాలను అందుకోలేనందు.. బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా షూటింగ్ కి వెళ్లాం.. కోవిడ్ వల్ల కూడా కొంత ఇబ్బంది జరిగింది. మీ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా నుంచి నేర్చుకున్న విషయాలను ఇక మీదట అలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఎవరిని బ్లేం చేయకుండా సినిమా వల్ల తప్పు జరిగిందని అర్ధమైందని చెప్పారు అనిల్ సుంకర. అఖిల్ లాంటి యంగ్ హీరోతో 80 కోట్ల బడ్జెట్ పెడుతూ బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ మీదకు వెళ్లడం అనేది చాలా పెద్ద తప్పు. ఈ సినిమాకు కథ వక్కంతం వంశీ ఇచ్చారు. మరి ఆయన కథను బౌండెడ్ గా ఇవ్వలేదా లేక కథ వరకే చెప్పి వదిలేశాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఏజెంట్ నిర్మాత చేసిన ఆ మెసేజ్ కి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. అన్ని కోట్ల బడ్జెట్ తో స్క్రిప్ట్ లేకుండా ఎలా వెళ్లారంటే కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిర్మాత ఎవరిని బ్లేమ్ చేయకుండా చాలా హుందాగా ప్రవర్తించారని చెప్పొచ్చు.

YES9 TV