Latest Posts

హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను పట్టుకున్నట్లు సీవైబీ సీపీ స్టీఫెన్ రవీంద్ర

దేశంలో ఎన్నో సెక్స్ రాకెట్లు బయటపడుతూనే ఉన్నాయి. మరెన్నో వెలుగు చూడని ముఠాలు తమ కార్యకలాపాలు విస్తరిస్తూనే ఉన్నాయి. ఏదో పట్టుబడినప్పుడు చూసీచూడనట్లుగా వదిలేయడంతో విచ్చలవిడి శృంగారానికి ద్వారాలు తెరిచినట్లు అవుతుంది. ఒక్కో కేసులో ఎంతో మంది పట్టపడుతూనే ఉన్నారు. తరువాత విడుదలై తమ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో వేలాది మందిని పక్కదారి పట్టిస్తున్నారు. సాంకేతికత పెరగడంతో ప్రసార మాధ్యమాలను వినియోగించుకుని సెక్స్ రాకెట్ విస్తరిస్తున్నారు. Hyderabad హైదరాబాద్ నగరంలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ భారీ సెక్స్ రాకెట్ ను పట్టుకున్నట్లు సీవైబీ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఈ ముఠాలో 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. 15 నగరాల నుంచి వేలాది మందిని ఈ ఉచ్చులోకి లాగుతున్నట్లు ఆధారాలు లభించాయి.

సెక్స్ ముఠాలో ఎందరో అమ్మాయిలను దింపుతున్నారు. విటులకు సౌకర్యంగా ఉండేందుకు నూతన పద్ధతులు అవలంభిస్తున్నారు. దీంతో వ్యభిచారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్తుతోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి వాటి ద్వారా అమ్మాయిలను విటుల వద్దకు పంపిస్తున్నారు. తెలంగాణ, ఏపీతోపాటు అంతర్రాష్ట్ర, విదేశాలకు సైతం అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు. తీగ లాగితే డంకంతా కదిలినట్లు సెక్స్ రాకెట్ లో 14 వేలకు పైగా అమ్మాయిలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. సెక్స్ రాకెట్ వ్యవహారంపై ఆరా తీస్తున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు వినూత్న పద్ధతుల్లో సెక్స్ రాకెట్ తతంగం కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. దీంతో సెక్స్ రాకెట్ లో ఎవరున్నారు? ఎవరి ప్రోద్బలంతో నడుస్తుందనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Editor