పాకిస్థాన్‌ క్రికెట్‌లో సలీం మాలిక్‌పై వసీం సంచలన ఆరోపణలు

వసీం అక్రమ్.. పాకిస్థాన్‌ క్రికెట్‌లో ఓ సెన్సేషన్‌. ఈ లెఫ్టామ్‌ పేస్‌బౌలర్‌ ప్రపంచంలోని మేటి పేస్‌బౌలర్లలో ఒకడు. కానీ తాను నేషనల్‌ టీమ్‌లోకి వచ్చిన తొలినాళ్లలో మాత్రం గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. సుల్తాన్‌: ఎ మెమొయిర్‌ అనే పేరుతో తన బయోగ్రఫీ తీసుకొచ్చిన వసీం.. అందులో తన సీనియర్‌ సలీం మాలిక్‌పై సంచలన ఆరోపణలు చేశాడు. 1984లో పాకిస్థాన్‌ తరఫున వసీం అక్రమ్‌ అరంగేట్రం చేయగా.. అంతకు రెండేళ్ల ముందే మాలిక్‌ టీమ్‌లోకి వచ్చాడు. సీనియర్‌ కావడంతో పాకిస్థాన్‌ టీమ్‌ విదేశీ టూర్లలో ఉన్నప్పుడు తనను ఓ పనోడిలా చూశాడని వసీం తన బుక్‌లో చెప్పాడు. “నా జూనియర్‌ స్టేటస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు. అతడు చాలా నెగటివ్‌, సెల్ఫిష్‌. నన్ను ఓ పనోడిలా చూశాడు. తనకు మసాజ్‌ చేయాలని డిమాండ్‌ చేశాడు. తన షూస్‌ క్లీన్ చేయాలని, బట్టలు ఉతకాలని చెప్పేవాడు.

ఇక రమీజ్‌, తాహిర్‌, మోహ్‌సిన్, షోయబ్‌ మహ్మద్‌లాంటి యువకులు నన్ను నైట్‌ క్లబ్స్‌కు ఇన్‌వైట్‌ చేసినప్పుడు కూడా కోపం వచ్చేది” అని అక్రమ్‌ తన బుక్‌లో తెలిపాడు. వసీం అక్రమ్‌, సలీం మాలిక్‌ ఎన్నో ఏళ్ల పాటు కలిసి ఆడారు. అయితే ఆడినన్ని రోజులూ ఈ ఇద్దరికీ అసలు పడేది కాదన్న వార్తలు వస్తూనే ఉండేవి. 1992 నుంచి 1995 వరకూ సలీం మాలిక్‌ కెప్టెన్‌గా ఉండగా.. అతని కెప్టెన్సీలోనూ వసీం ఆడాడు. మాలిక్‌ కెప్టెన్సీలో పాకిస్థాన్‌ 12 టెస్టుల్లో ఏడు, 34 వన్డేల్లో 21 గెలిచింది. 2000 ఏడాదితో సలీం మాలిక్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో జీవితకాల నిషేధం ఎదుర్కొన్నాడు. గతంలో వసీం అక్రమ్‌పై కూడా మాలిక్‌ ఇలాంటి ఆరోపణలే చేశాడు. తాను కెప్టెన్‌గా ఉన్న సమయంలో వసీం అసలు మాట్లాడే వాడు కాదని, అక్రమ్‌కు రావాల్సిన కెప్టెన్సీ తనకు రావడం వల్లే అలా చేసేవాడని చెప్పాడు. తాను అతనికి బౌలింగ్‌ ఇచ్చే సమయంలోనూ బాల్‌ను తన చేతుల్లో నుంచి లాక్కొనే వాడని తెలిపాడు. ,

Editor