ఎంబీబీఎస్ విద్యార్థులకు ఘన సన్మానం….

ఎంబీబీఎస్ విద్యార్థులకు ఘన సన్మానం
ముదిగుబ్బ మండల కేంద్రంలోని అఖిల గాండ్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు.
మేడాపురానికి చెందిన తుంపెర సందీప్ కుమార్, బసంపల్లికి చెందిన కే. వినీత్ కుమార్, కుటాగుళ్లకు చెందిన కె. హర్షవర్ధన్, మేడాపురానికి చెందిన బి.కె. అశ్విత, పాముదుర్తికి చెందిన బి. మహతిని సంఘం ప్రతినిధులు సన్మానించారు.
అలాగే గోరంట్ల మండలం ఎగువ గంగంపల్లి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కే. రామచంద్రప్పకు శ్రీ సత్యసాయి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించిన సందర్భంగా ఆయనను కూడా సత్కరించారు.
కార్యక్రమంలో జిల్లా అఖిల గాండ్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సి.వి. కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి గార్లదిన్నె మల్లికార్జున, కోశాధికారి పుట్టపర్తి నరసింహులు, ఉపాధ్యక్షుడు ముత్యాల శ్రీనివాసులు, ఉద్యోగుల విభాగం ప్రతినిధులు, ముదిగుబ్బ సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor