కర్నూలు జిల్లా
ఆలూరు
బళ్లారి – కర్నూలు ప్రధాన రహదారిపై ఉన్న ప్రమాదకరమైన భారీ గుంతపై వార్తలు వచ్చినా, అధికారులు నామ్కే వాస్తేగా తాత్కాలిక మరమ్మతులు చేసి చేతులు దులుపుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అధికారులు నాసిరకంగా చేసిన ఈ పనుల వల్ల మళ్లీ రోడ్డు గుంతలమయమై, వాహనదారులు తీవ్ర భయాందోళనల మధ్య ప్రయాణించాల్సి వస్తోంది.
హెచ్చరిక బోర్డులు, స్లో డ్రాన్ సూచికలు తక్షణమే ఏర్పాటు చేయాలి
మరమ్మతులు సరిగా లేకపోవడం వల్ల ఏ క్షణాన వాహనాలు అదుపుతప్పుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.
ఈ నేపథ్యంలో అధికారులు తక్షణమే స్పందించి:
ప్రమాదకర ప్రాంతంలో వాహనాలు నెమ్మదించేలా ‘Slow Down’ (వేగం తగ్గించండి) బోర్డులను ఏర్పాటు చేయాలి.
రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించేలా రేడియం సైన్ బోర్డులు, ప్రమాద హెచ్చరిక గుర్తులను అమర్చాలి.
తాత్కాలిక పూతలు కాకుండా, రహదారిని శాశ్వతంగా బలపరిచేలా నాణ్యమైన రీతిలో సీసీ రోడ్డు లేదా నాణ్యమైన తారు రోడ్డును పునర్నిర్మించాలి.
ఇప్పటికైనా నేషనల్ హైవే అధికారులు, స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యాన్ని వీడి, రోడ్డును గట్టిగా నిర్మాణం చేసి ప్రయాణికుల అమూల్యమైన ప్రాణాలను కాపాడాలని స్థానికులు, వాహనదారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
