కర్నూలు జిల్లా
ఆలూరు మండలం
ఆలూరు లో
బళ్లారి – కర్నూలు ప్రధాన జాతీయ రహదారిపై ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యం వేల సంఖ్యలో ప్రయాణించే ఈ మార్గంలో రోడ్డు మధ్యలోనే నిలువెత్తు గుంత పడటంతో రాకపోకలు సాగించే బైకులు, కార్లు, ఇతర వాహనాలు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నాయి.
రాత్రి వేళల్లో మరియు వర్షం పడిన సమయంలో ఈ గుంత కనిపించకపోవడంతో వాహనాలు అదుపుతప్పి పడిపోయి, పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోయే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు వెంటనే స్పందించాలి:
రహదారిపై ఏ క్షణాన ఏ ప్రమాదం జరుగుతుందోనని భయంతో ప్రయాణించాల్సి వస్తోందని వాహనదారులు, స్థానిక ప్రజలు వాపోతున్నారు. జాతీయ రహదారుల అధికారులు (NHAI) మరియు సంబంధిత ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, యుద్ధ ప్రాతిపదికన ఈ గుంతను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్లక్ష్యాన్ని వీడి అమాయక ప్రజల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
