గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి…

గణేష్ ఉత్సవాల్లో నిబంధనలు పాటించాలి
ముదిగుబ్బ, వినాయక చవితి సందర్భంగా ముదిగుబ్బ అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ విగ్రహాల నిర్వాహకులతో పోలీసులు అవగాహన సమావేశం నిర్వహించారు.
ఇన్‌స్పెక్టర్ కె. రామసుబ్బయ్య మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు. మండపాల వద్ద ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, ప్రజల భద్రతకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
డీజేలు, సౌండ్ సిస్టమ్‌లను నిబంధనల ప్రకారం ఉపయోగించాలని, రాత్రి 10 గంటల తర్వాత వినియోగించరాదన్నారు. నిమజ్జనం సమయంలో పోలీసులు సూచించిన మార్గం, సమయాన్ని పాటించాలని తెలిపారు.
ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిర్వాహకులు, వాలంటీర్లు పోలీసులకు సహకరించాలని ఇన్‌స్పెక్టర్ కోరారు.

Posted Under AP
Editor