ముదిగుబ్బ yes9TV
సత్యసాయి జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ పడిపోతున్న నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని జనతా వారధి జిల్లా కో-కన్వీనర్, సత్యసాయి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు సోమల ప్రకాష్ నాయుడు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న “మీ సమస్య – మా బాధ్యత” కార్యక్రమంలో ప్రజల నుంచి భూగర్భ జలాల సమస్యపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. జిల్లాలో పెద్ద ఎత్తున ఇంకుడుగుంటలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, అపార్ట్మెంట్లు, భారీ భవనాల్లో ఇంకుడుగుంటలను తప్పనిసరి చేయాలని, చెరువులు, కుంటలు, కాలువలు, వాగులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చెక్‌డ్యామ్‌లు, పెర్కొలేషన్ ట్యాంకులు, రీచార్జ్ పిట్స్‌ను విస్తృతంగా నిర్మించాలని కోరారు.
భూగర్భ జలాల పరిరక్షణను ప్రజా ఉద్యమంగా చేపట్టి ప్రజలు, అధికారులు, స్థానిక సంస్థలు కలిసి పనిచేయాలని సోమల ప్రకాష్ నాయుడు సూచించారు. మండలాల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, పెద్ద ఎత్తున ఇంకుడుగుంటల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కోరారు.
