గోనెగండ్లలో ఘనంగా APUWJ 69వ ఆవిర్భావ దినోత్సవం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం మండల కేంద్రమైన గోనెగండ్లలో APUWJ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని నాయరా పెట్రోల్ బంక్ సమీపంలో APUWJ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను ఆవిష్కరణ చేసి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు మధు, అనిఫ్, అక్బర్, కరుణాకర్, ఈశ్వర్ మాట్లాడుతూ….
1956లో ఆవిర్భవించిన APUWJ నేడు 69 వసంతాలు పూర్తి చేసుకుని జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందన్నారు. వర్కింగ్ జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఏకైక సంఘం APUWJ అని కొనియాడారు.
జర్నలిజం విలువలను కాపాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. ప్రతి జర్నలిస్టు ఐక్యంగా ఉండి సంఘాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు కల్పించి ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గౌస్,షఫీ, కిరణ్ కట్టుబడి ఖలీల్, రుద్ర, వీర నాయుడు వెంకటేష్ నరేష్ APUWJ మండల నాయకులు, సభ్యులు, వివిధ పత్రికల, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
