ముదిగుబ్బ yes9 TV
ముదిగుబ్బలోని ఆక్స్ఫర్డ్ గ్లోబల్ జూనియర్ కాలేజీలో నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా
నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం వై హరీష్,ఏ రామ మోహన్,ఇంటర్మీడియట్ ప్రిన్సిపాల్ వై సుధాకర్, డిగ్రీ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ జె.నాగేంద్ర అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. నూతన విద్యార్థులను సీనియర్ విద్యార్థులు ఆత్మీయంగా స్వాగతించారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటలు, వినోద కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా యాజమాన్యం, ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, నూతన విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తమ లక్ష్యాలను సాధించాలని, కళాశాల ప్రతిష్ఠను పెంచేలా ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.విద్యార్థుల్లో స్నేహభావం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ఫ్రెషర్స్ పార్టీ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
ఆక్స్ఫర్డ్ గ్లోబల్లో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు..
