Latest Posts

కళ్యాణదుర్గంలో “ఇంటింటికి కూటమి ప్రభుత్వం”: విద్యార్థులకు ఉచిత సైకిళ్లు, రైతులకు ఎల్ నినోపై అవగాహన

అనంతపురం జిల్లా -కళ్యాణదుర్గం

 

కళ్యాణదుర్గం మండలంలో నిర్వహించిన “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేయడంతో పాటు రైతులకు ఎల్‌నినోపై అవగాహన కల్పించారు.

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలంలోని ముద్దినాయనపల్లి, తూర్పు కోడిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు “ఇంటింటికి కూటమి ప్రభుత్వం” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు వివరించారు. గ్రామస్తులు తెలిపిన సమస్యలను తెలుసుకుని, తాగునీటి ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ఆర్సీ ట్రస్ట్ ఆధ్వర్యంలో “ఎమ్మెల్యే విద్యాచక్రం” పథకం కింద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రైతులకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బైరవాని తిప్ప ప్రాజెక్టు, కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పనులను పూర్తి చేస్తామని, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.

Posted Under AP
Editor