ఎల్నినీనో ప్రభావన్ని ఎదుర్కొనేందుకు రైతులు సిద్ధంగా వుండాలి జిల్లా వ్యవసాయ అధికారి ..

 

జిల్లాలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఎల్నినో సమస్యలను రైతులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య తెలిపారు. శుక్రవారం ముదిగుబ్బ మండలంలోని యాకర్లకుంటపల్లి గ్రామంలో రైతన్నా మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ఈరోజు నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్నినో నివారణ చర్యలను రైతులకు వివరించడం జరుగుతుందని తెలిపారు.కంది, ఉలవ, అలసంద, పెసర, జొన్న వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. పంటలు బెట్టపరిస్థితిలో ఉంటే పొటాషియం నైట్రేట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటిలో కలుపుకొని పంటలపై పిచికారి చేసుకోవాలని తెలిపారు. పంటలు సాగుచేసిన ప్రతి రైతు ఈ- పంట నమోదు తో పాటు పంటల బీమాను చేయించుకోవాలని తెలిపారు. జిల్లా ఉద్యాన అధికారి జయ కుమార్ బాబు మాట్లాడుతూ అవకాశమున్న రైతులు నీటి కుంటల నిర్మాణాన్ని చేపట్టి వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ఉత్తమమని తెలిపారు. రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. స్ప్రింక్లర్లు, డ్రిప్ పద్ధతులను ఉపయోగించి సాగునీటిని ఆదా చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కదిరి ఏ డి ఏ సనా వుల్లా, మండల వ్యవసాయ అధికారి రవీంద్ర,వ్యవసాయ సిబ్బంది ,ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది,మండల నాయకులు మనోహర్, సూరి ,రైతులు పాల్గొన్నారు

Posted Under AP
Editor