*ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
* చేనేత కార్మికులకు అండగా కూటమి ప్రభుత్వం
*రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేత : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు చేనేత కార్మికుల ఇళ్లకు వెళ్లి _రూ.25 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
ప్రభుత్వం చేనేతలకు అందిస్తున్న సహాయ సహకారాలు గురించి కాలవ వారికి వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 54 వేల మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున సహాయం అందిస్తున్నాం. నేతన్నలకు ఇది ఒక పండుగ రోజు అన్నారు.
స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పటి నుంచి చేనేత వర్గం TDP కి బలమైన అండగా ఉంది. చేనేత రంగంతో పార్టీకి విడదీయరాని బంధం ఉందని తెలిపారు.
చేనేత కార్మికుల సంక్షేమానికి CM చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో రూ.250 కోట్లు కేటాయించాం. ఇంతకు ముందు మగ్గం పనివారికే ఉన్న ప్రయోజనాలను ఇప్పుడు రాట్నం వడికేవారు, రంగులు అద్దే వారికి కూడా ‘నేతన్న సేవలో’ కింద వర్తింపజేశాం. దీనితో మరో 10 వేల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు.
అనంతపురం జిల్లాలోని రాయదుర్గం చేనేతకు పుట్టినిల్లు. ఇక్కడ 250 మంది చేనేత కార్మికులకు సహాయం అందుతోంది. గుమ్మగట్ట మండలంలోని 300 మంది కంబళ్ల కార్మికులను కూడా పథకంలో చేర్చాలని మంత్రి సవితమ్మకు వినతి ఇచ్చాం.
“నేతన్న మగ్గం ఆగకూడదు. నేతన్న కుటుంబంలో పొయ్యి ఆరిపోకూడదు. చేనేత కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకోవాలి” అనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
అర్హత ఉన్నా జాబితాలో పేరు రాని వారిని కూడా గుర్తించి లబ్ధిదారులుగా చేరుస్తామని కాలవ హామీ ఇచ్చారు.
