పాడి రైతులకు ప్రభుత్వం అండ.. 50% సబ్సిడీపై పశువుల దాణా పంపిణీ…

ముదిగుబ్బ మండలం సానేవారి పల్లి గ్రామ సచివాలయ పరిధిలోని మలక వేమల క్రాస్ లో ఉన్న” రైతు సేవా కేంద్రంలో” ని రైతులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం కల్పించిన 50% కల్పించిన సబ్సిడీతో 50 కేజీల రెండు బ్యాగ్ లు రైతులకు “పశువుల దాన ” పంపిణీ చేశారు. పాడి పశువుల రైతులకు ఈ దాణా వలన ఆరోగ్యవంతమైన, మంచి పాల దిగుబడి కూడా పశువుల ద్వార లభిస్తుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సానేవారిపల్లి సచివాలయ సిబ్బంది అయిన ‘అనిమల్ హస్బండరీ అసిస్టెంట్ ‘ చెన్న కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మలక వేముల గ్రామపంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బండి మల్లికార్జున, మాదాసు గంగాద్రి,వేమారెడ్డి,నాగేంద్ర కుమార్ రెడ్డి,రాయుడు, చీకటి రవికుమార్ నరసింహులు తదితర పాడి పశువుల రైతులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor