Latest Posts

ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడం కోసం వృద్ధురాలిని దారుణ హత్య…

అనంతపురం జిల్లా- కళ్యాణదుర్గం

*ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చడం కోసం వృద్ధురాలిని దారుణ హత్య*

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చుకోవడానికి వృద్ధురాలిని హత్య చేసి బంగారు నగలు దోచుకున్న నిందితుడిని అరెస్ట్ చేసి, నగలను స్వాధీనం చేసుకున్న కళ్యాణదుర్గం పోలీసులు.

కళ్యాణదుర్గం వడ్డేకాలనీకి చెందిన 24 ఏళ్ల రఘు, ఆన్‌లైన్ బెట్టింగ్‌లో అప్పులు చేయడంతో, గత జూన్ 30న ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీదేవి ఇంట్లోకి వెళ్లి స్టీల్ రాడ్ తో ఆమె తలపై దాడి చేసి అనంతరం స్టీల్ కడ్డీతో గొంతులో పొడికి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు . అనంతరం ఆమె ఒంటిపై ఉన్న సుమారు 2.6 తులాల బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడని వెల్లడించారు.

త్వరితగతిన కేసు త్వరితగతిలో కేసులు చేదించిన పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

Posted Under AP
Editor