ఎస్ 9 న్యూస్
ఉరవకొండ జూలై 27
అనంతపురం జిల్లా బ్యూరో
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండల పరిధిలో ఉండబండ గ్రామానికి సమీపాన
దేవాలయాల్లో భక్తుల సమర్పించే కనుకుల కోసం హుండీ ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాం కానీ ఇక్కడ పేకాట నుంచి 15 నిమిషాల కోసం సారీ వచ్చే ఆదాయం కోసం ఉండి ఏర్పాటు చేశారు విషయం తెలిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు. కానీ ఇది ముమ్మాటికి నిజం . అధికారం మాటన నేతలుగా చలామణి అవుతూ అక్రమార్చన కోసం పేకాట శిబిరం నిర్వహిస్తున్న ఓ ముఠా బాగోతం ఇది ఆ వివరాలు ఇలా ఉన్నాయి
ఉరవకొండ, కూడేరు, విడపనకల్ మండలాలకు చెందిన అధికార పార్టీ గ్రామ, మండల స్థాయి నాయకులు కొందరు ముఠాగా ఏర్పడి పేకాట ఆడిస్తున్నారు ఈ విషయం బహిరంగ రహస్యమైనప్పటికీ చర్యలు చేపట్టడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తారు. జిల్లా కేంద్రంలో కాపురం ఉంటున్న ఒక నాయకుడు పోలీసులతో మాట్లాడి ఈ పేకాట నిర్వహణకు మార్గం ఏర్పాటు చేసినట్టు సమాచారం మొట్టమొదటిసారిగా పెన్నా నది ఒడ్డున పేకాట మొదలుపెట్టారు చేయడంతో దాడులు జరిగాయి 10 లక్షలు పడింది ఈ సంఘటన తర్వాత కుడేరు మండలం మరుట్ల అటవీ ప్రాంతానికి మకాం మార్చారు. అక్కడ ఫోటో వీడియోలను సేకరించిన స్థానికులు ఏకంగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి అందజేశారు దాంతో చర్యలు చేపట్టారు. ఒకరిపై గంజాయి కేసు నమోదు చేయడంతో బెదిరిన ముఠా తన మకాం ను ఉండబండి వీరభద్ర స్వామి దేవాలయం సమీపానికి మార్చింది
స్థానికుడైన ఒక వ్యక్తి పొరుగు మండలానికి చెందిన కొందరు ముఠాగా ఏర్పడి వ్యవహారం నడుపుతున్నారు భాగస్తులకు విభేదాలు రాకుండా అక్కడ ఒక ఉండిను ఏర్పాటు చేశారట లోనా బయట ఆడుతూ కోసుకు ఐదువేల రూపాయలు ఆడించినందుకుగాను హుండీలో వేయాలట అలా ఎన్ని కోర్సులు ఆడితే అన్ని 15000 వస్తాయన్నమాట ఇలా ప్రతిరోజు రెండు నుంచి మూడు లక్షల దాకా వసూలు అవుతున్నట్టు సమాచారం రాత్రి పది గంటలకు ఆట మొదలెడితే తెల్లవారుజామున 4 గంటల వరకు ఆడిస్తారు ఈ లెక్కన లక్షలాది రూపాయలు రాత్రికి రాత్రి చేతులు మారుతున్నాయి ఇలా హుండీలో వేసిన మొత్తం కోడేరు మండలానికి చెందిన ముఠా సభ్యుడు ఉదయాన్నే తెలుస్తాడట వచ్చిన మొత్తంలో 2,00,000 పోలీసులకు మరో 2,00,000అనంతరంలో కాపురం ఉండే నాయకునికి మిగతా సొమ్ము ముఠా సభ్యులు పంచుకునేలా ఒప్పందం కుదిరిందట
ఇంత జరుగుతున్న ఎందుకు చర్యలు చేపట్టలేదు అనే అంశాన్ని విశదీకరిస్తూ మరో కథనంలో వెల్లడిస్తాం
