- నేడు విశ్వ మోహనుడి 14వ వర్ధంతి
పుట్టింది పల్లెటూరు.. ప్రజల కష్టాలు తెలసున్న నాయకుడిగా ఎదిగారు.. అన్న ఎన్టీఆర్ కుటుంబంలో ఒకడిగా మెలుగుతూ.. అన్న పెట్టిన తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో రాణిస్తూ.. మచ్చలేని మహనీయుడిగా తెలుగు రాష్ట్ర ప్రజల్లో మంత్రిగా అందరికి న్యాయపరంగా ఉంటూ అనురాగం.. ఆప్యాయతలు చూపుతూ ప్రతి ఒక్కరి మదిలో చిరస్మరణీయుడవు అయ్యావు.. అభివృద్ధి చెయ్యాలంటే నీ తర్వాతే ఇంకెవరైనా అని చాటి చెబుతూ ప్రాదేశిక నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడు బివి విశ్వమోహనుడు.. బివి మూడు పదులఏళ్లుగా రాజకీయ చరిత్రలో తన మార్కును చిరస్థాయిగా నిలబెట్టావు.. మీరు బౌతింగా దూరమైనా మీరు చూపిన ప్రేమలు, అనురాగాలు ఆప్యాయతలు మరువలేనివి అని మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి గారి 14వ వర్ధంతిని పురస్కరించుకుని సందర్భంగా
– ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా రెండు తెలుగు రాష్ట్రాలకు సుపరిచితులు దివంగత నేత బివి విశ్వమోహనుడి జీవిత ప్రస్థానం కల్లూరు మండలం ఉలిందకోండ వాసిగా తన రాజకీయ ప్రస్థానాన్ని 1983 ఏడాదిలో అన్న ఎన్టీర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో అడుగులు వేసి ఎమ్మిగనూరు శాసన సభ్యులు బైరెడ్డి విశ్వమోహనరెడ్డి గారి తన 30 ఏళ్ల రాజకీయాలు ఎంతో క్రీయాశీలకంగా చేపట్టారు.. తెలుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు నందమూరి తారక రామారావు నేతృత్వంలో ఎమ్మిగనూరు శాసనసభ స్థానానికి వరస విజయాలు అందుకుని ఎన్టీఆర్ క్యాబినెట్ లో పురపాలక, రోడ్లుభవనాలు, రవాణా శాఖలలో మంత్రిగా పనిచేశారు. వరసగా 5 సార్లు విజయం సాదించిన విశ్వమోహనుడికి తన సమీప ప్రత్యర్థి ఎర్రకోట చెన్నకేశవరెడ్డిపై 2 పర్యాయాలు గెలిచినా.. అదే ప్రత్యర్థిపై 2004 ఎన్నికల్లో తొలి ఓటమి చవిచూశారు. నాటి నుండి 2009, ఎన్నికలతోపాటు 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ఓటమి చెందడంతో ఎర్రకోటది బివిపై హ్యాట్రిక్ విజయంతో పై చెయ్యి అయ్యింది.. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో ఉన్న బివి మోహన్ రెడ్డి గారు 2012 జూలై 27న కనిపించని లోకాలకు వెళ్లారు.. ఆయన తన రాజకీయ జీవితంలో ఆజాత శత్రువుగా పేరు సంపాదించుకుని తెలుగుదేశం పార్టీలో పార్టీ ఉపాద్యక్షులుగా 23 జిల్లాల ఉమ్మడి ఆంద్రరాష్ట్రంలో పార్టీని తనదైన విదానంలో ముందుకు తీసుకుపోతూ తన కర్తవ్యన్ని నిర్వర్తించారు. అనంతరం ఎన్టీఆర్ మరణం కంటే ముందుగానే నారా చంద్రబాబునాయుడు క్యాబినెట్లో కూడా అమాత్యా అనే పదానికి వన్నెతెచ్చరు. అక్కడ భూగర్భ, జల వనరులు, మున్సిపల్ శాఖ మత్యులుగా తనను అభిమానిచే చేనేతపురి ప్రజల కష్టాల్లో ఒకడిగా నిలిచి తిష్ట వేసిన సమస్యలకు దిశ నిర్దేశం చేసి ప్రతిపల్లెకు రోడ్లువేయించి. తాగునీరు, మౌలిక సమస్యలు తీర్చడంలో సాటిలేని నాయకులు అనిపించుకున్నారు బివి.. తను లేరన్న లోటును తెలుదేశం నాయకులకు, కార్యకర్తలకు త నయుడు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారిని అందించి ఎంతో మనోదైర్యాన్ని అందించారు.. తండ్రి తర్వాత నాయకునిగా బివి విశ్వమోహనుడి తనయుడు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు కూడ పోటిలోనే శాసనసభకు వెళ్లి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీ న్యాయత్వంలో క్రియాశీలకంగా ఉంటున్నారు. 14వ వర్థంతిని ఎమ్మిగనూరు తన నివాసంలో మంగళవారం జరుపుతున్నట్టు ఎమ్మెల్యే కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు తెలిపాయి.. అలాగే బివి స్వగ్రామం అయిన ఉలిందకొండలో, ఎమ్మిగనూరు లో తనయుడు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు ఉంటాయి.
