విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి: వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై. నైరుతి రెడ్డి డిమాండ్.

గుంతకల్లు టౌన్* 27-07-2026:

ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు,గుంతకల్లు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు,ఇన్‌చార్జ్ వై. వెంకట్రామిరెడ్డి గారి సూచనలతో విద్యార్థి, యువజన విభాగం ఆధ్వర్యంలో వైవీర్ క్యాంప్ కార్యాలయంలో పోస్టర్ విడుదల కార్యక్రమం వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి వై. నైరుతి రెడ్డి గారి అధ్యక్షతన నిర్వహించబడింది.

ఈ సందర్భంగా శ్రీమతి నైరుతి రెడ్డి మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత చేసిన పోరాటాల నేపథ్యంలో నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, ఆ వ్యవహారంపై పూర్తి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఎన్నికల సమయంలో యువతకు హామీ ఇచ్చిన నెలకు ₹3,000 నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలని, అలాగే విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన, విద్యా దీవెన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 28వ తేదీన అనంతపురంలో విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన ర్యాలీలో విద్యార్థులు, నిరుద్యోగ యువత, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో* వైఎస్సార్సీపీ విద్యార్థి, యువజన విభాగాల నాయకులు,పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు,వివిధ అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు, మహిళా, మాజీ కౌన్సిలర్లు, వార్డు ఇన్‌చార్జులు, పార్టీ నాయకులు,కార్యకర్తలు, యువకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Posted Under AP
Editor