కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని ఇంకెంత కాలం మోసం చేస్తారు సీఎం చంద్రబాబు నాయుడు అని సీనియర్ న్యాయవాది, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐ. ఏ. ఎల్.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. సురేంద్ర కుమార్ విమర్శించారు.
శుక్రవారం నాడు అయన కర్నూలు జిల్లా పత్తికొండలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ శనివారం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన ఆస్పరికి సీఎం చంద్రబాబు వస్తున్నా సందర్బంగా కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గూర్చి స్పష్టమైన హామీ ఇచ్చి తక్షణమే ఏర్పాటు చేయాలని అయన డిమాండ్ చేశారు.
కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయన ఆ ఎన్నికలలో గెలిచి సీఎం అయ్యారని అయిన హైకోర్టు హామీ నెరవేరాలేదని తెలిపారు. ప్రస్తుతం తిరిగి అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తి అయిందని, ప్రతి బహిరంగ సభలో సీఎం, అయన మంత్రులు కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెపుతున్నారని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని చెప్పిన అబద్దమే పదే పదే చెప్పి ఎవరిని మోసం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు అని అయన అన్నారు. మీ అబద్దాలను 2014 నుంచి అందరు గమనిస్తున్నారని మీకు బుద్ది చెప్పే రోజులు దగ్గర పడ్డాయాని అయన తెలిపారు.
1937 నవంబర్ 16 న జరిగిన శ్రీ బాగ్ ఓడంబడిక ప్రకారం రాష్ట్ర రాజధాని గాని లేదా హైకోర్టును గాని రాయలసీమలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు. దీని ప్రకారం 1953లో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలును రాజధానిగా చేశారని చెప్పారు. ప్రస్తుతం రాయలసీమ లో రాజధాని కానీ హైకోర్టు కానీ లేవని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మన రాష్ట్ర లో రాజధాని, హైకోర్టు ఒకే దగ్గర అమరావతి లో ఏర్పాటు చేసారని చెప్పారు. ఈ నేపథ్యంలో రాయలసీమ కు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు. పాలకులు రాయలసీమ ప్రాంతం వారు ఐనప్పటికి రాయలసీమ కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయంగా చెప్పాలంటే ఒక ప్రాంతం లో రాజధాని ఉంటే మరొక ప్రాంతం లో హైకోర్టు ఉండాలని అన్నారు. కానీ మన రాష్ట్రం లో రెండు ఒకే ప్రాంతం లో ఉన్నాయని తెలిపారు.కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేసేదానికి పాలక ప్రభుత్వలకు మనసు రావడం లేదని చెప్పారు. హైకోర్టు స్థానంలో కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తానని సీఎం బాబు 2014 నుండి హామీలు ఇస్తూనే ఉన్నారని తెలిపారు.కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు రాజకీయ నాయకులు కు ఎన్నికల హామీగా పనికి వస్తుందని ఆరోపించారు.
ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తున్న హైకోర్టు బెంచ్ ఏర్పాటు కనుచుపు మేరలో కనబడటం లేదని చెప్పారు.హామీలు మాత్రం ఇస్తున్నారని ఆచరణలో విఫలం అయ్యారని అన్నారు.
శనివారం కర్నూలు జిల్లా మండల కేంద్రమైన ఆస్పరి కి సీఎం చంద్రబాబు వస్తున్నా సందర్బంగా హైకోర్టు బెంచ్ పై స్పష్టమైన హామీ ఇచ్చి, తక్షణమే హైకోర్టు బెంచ్ ఏర్పాటు కు మార్గమం సుగుమం చేయాలని బి. సురేంద్ర కుమార్ కోరారు.
