ముదిగుబ్బ Yes9 TV
ముదిగుబ్బలోని ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో మంగళవారం నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు–విద్యార్థుల ఆత్మీయ సమావేశం (PTM) కార్యక్రమానికి పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, “చదువే మన పిల్లలకు శాశ్వత ఆస్తి” అని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను అందించి, క్రమశిక్షణతో పెంచాలని సూచించారు. విద్యతోనే సమాజంలో గౌరవం, గుర్తింపు, ఉజ్వల భవిష్యత్తు లభిస్తాయని అన్నారు. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని చెప్పారు.
ప్రపంచానికి విద్యుత్ బల్బును అందించిన శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్ జీవితాన్ని విద్యార్థులకు ఉదాహరణగా వివరించారు. చిన్ననాట ఎదురైన అవరోధాలను అధిగమించి, తల్లి ప్రోత్సాహం, విజ్ఞానంపై ఆసక్తితో ప్రపంచాన్ని వెలిగించిన మహనీయుడిగా ఎదిగారని తెలిపారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విజయానికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, గురువుల శిక్షణ, నిరంతర సాధనే కారణమని పేర్కొంటూ, అలాంటి మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని సూచించారు.మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే విద్య, కృషి, పట్టుదలే ప్రధాన మార్గాలని అన్నారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన అనేక మంది ప్రపంచ స్థాయి నాయకులుగా ఎదిగారని గుర్తు చేశారు. చిన్న స్థాయి నుంచి ప్రారంభించి దేశ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ, సాధారణ కుటుంబం నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్య మనిషికి విజ్ఞానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, సమాజంలో గౌరవాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎంఈఓ వెంకట చలపతి, రామనప్ప, ఆక్స్‌ఫర్డ్ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్లు రామ మోహన్ హరీష్, ప్రిన్సిపాల్ హర్షియా, చల్లా శ్రీనివాసులు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శివారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ నాగేంద్ర, సీఆర్పీ బాబ్జాన్, అరవింద్ రెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు….
చదువే మన పిల్లలకు శాశ్వత ఆస్తి విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు..
