కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో ఆలూరు –స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి..
–ప్రతి స్థానంలో పార్టీ అభ్యర్థులను నిలబెట్టి విజయం సాధించాలి..
–కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటాం ఎవరు భయపడాల్సిన అవసరం లేదు..జేపీ నేతలు
ఆలూరు మండల కేంద్రంలోని వాసవి కళ్యాణ మండపంలో సోమవారం బీజేపీ ఆలూరు అసెంబ్లీ సంస్థాగత సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు అక్కమ్మతోట రామకృష్ణ, జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాసులు, హైకోర్టు న్యాయవాది పురుషోత్తం రెడ్డి, గుమ్మనూరు నారాయణ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మురళీకృష్ణ, బీజేవైఎం నాయకుడు సునీల్ రెడ్డి హాజరై పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీతో పాటు అన్ని స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపి విజయానికి కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని సూచించారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎవరైనా బెదిరించే లేదా ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తే చట్టబద్ధంగా ఎదుర్కోవాలని తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి సమస్య వచ్చినా భారతీయ జనతా పార్టీ అండగా నిలిచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రాఘవేంద్రరావు, నీలకంఠ, విట్ట రమేష్, వెంకట రాముడు, బసవరాజు, చిదానంద, తిమ్మప్ప, అరికెర సర్పంచ్ నాగరాజు, ముసనపల్లి సర్పంచ్ సోమశేఖర్ తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ శ్రేణులు సిద్ధం కావాలి….
