గుంతకల్ పట్టణంలో తీవ్ర తాగునీటి సంక్షోభం: అధికారుల నిర్లక్ష్యంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరసన, సమర శంఖం

” గుంతకల్ పట్టణంలో తీవ్ర తాగునీటి సంక్షోభం – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన”మీడియాతో మాట్లాడుతున్న గుంతకల్ మాజీ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతిరెడ్డి గారు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామాంజనేయులు గారు…
గుంతకల్ పట్టణ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 8 రోజులకు ఒకసారి మాత్రమే తాగునీటి సరఫరా జరుగుతుండటంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారు.
ఈ సమస్యను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కొట్టాల రోడ్డు లో గల SS ట్యాంకును ( సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్) గుంతకల్ మాజీ ఎమ్మెల్యే శ్రీ వై. వెంకటరామిరెడ్డి గారి ఆదేశాల మేరకు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలో నీటి ట్యాంకును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు పట్టణ ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా కల్పించడంలో సంబంధిత అధికారులు, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, పట్టణ మరియు మండల నాయకులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజల సమస్యల పరిష్కారానికి తమ మద్దతు తెలిపారు.
“ప్రజలకు తాగునీరు అందించడం ప్రభుత్వ బాధ్యత – ప్రజల దాహం తీర్చే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుంది.”

Posted Under AP
Editor